న్యూఢిల్లీ: మధుమేహంతో (Diabetes) బాధపడేవారి రక్తంలో చక్కెర స్థాయిని (Blood Sugar Levels)తెలుసుకోవడం కోసం వేళ్లపై నొప్పి పుట్టించే ప్రక్రియ ఇక అవసరం ఉండదు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు బ్లడ్ షుగర్ మానిటర్‌ను అభివృద్ధి చేశారు. ఇది కాంతిని ఉపయోగించి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నిర్ధారిస్తుంది. ఇది రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే విధానాన్ని ఉపయోగించి, పరీక్షలు చేస్తుంది.
ప్రకాశవంతం, సురక్షితం అయిన కాంతిని వ్యక్తి చర్మంపైకి ప్రసరింపజేసి, గ్లూకోజ్ లెవెల్స్‌ను వేగంగా, కచ్చితంగా నిర్ధారిస్తుంది. మొదట్లో దీనిని డెస్క్‌టాప్ పరిమాణంలో తయారు చేశారు. ఆ తర్వాత షూ బాక్స్ పరిమాణానికి తగ్గించారు. కేవలం మూడు ముఖ్యమైన సంకేతాలపై దృష్టిపెట్టి ఈ పరీక్షను నిర్వహించవచ్చు. ఇది సరళమైనది, చౌక కూడా.