హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురసరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 25 మెడికల్ కాలేజీల్లో శనివారం రక్తదాన శిబిరాలు నిర్వహించినట్టు మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకులు లోకేశ్, నవనీత్ తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వైద్య విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 1050మందికిపైగా వైద్య విద్యార్థులు రక్తదానం చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల సేవాభావానికి అభినందనలు తెలియజేసినట్టు వారు పేర్కొన్నారు.
దేశంలో సంక్షోభ పరిస్థితులు:కూనంనేని
హనుమకొండ, జూన్ 14: దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని సంక్షోభ పరిస్థితులు కనబడుతున్నాయని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా నక్కలగుట్టలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మానవ హ కులను ఉల్లంఘిస్తున్నదని, ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని కలలు కంటున్నదని ఎద్దేవాచేశారు. మావోయిస్టులు లొంగిపోతామంటున్నా.. ఎన్కౌంటర్లు చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ ఆర్థికం గా జపాన్ను దాటిపోయిందని మభ్యపెడుతున్నదని విమర్శించారు.