మెడకు టవల్ బిగుసుకుని అంధ విద్యార్థి మృతి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలోని అంధుల పాఠశాలలో ఓ అంధ విద్యార్థి మెడకు టవల్ బిగుసుకుని మృతి చెందాడు. ఈ ఘటనకు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతు డి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కరీంనగర్ రాంనగర్, జూలై 9: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలోని అంధుల పాఠశాలలో ఓ అంధ విద్యార్థి మెడకు టవల్ బిగుసుకుని మృతి చెందాడు. ఈ ఘటనకు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతు డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన దాన శ్రీవాత్సవ్ (12) రేకుర్తిలోని అంధుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గదిలోకి వచ్చిన శ్రీవాత్సవ్.. వానకాలం కావడంతో బట్టలు ఆరేసేందుకు గదిలో వైరుతో దండెం కట్టాడు. దానిపై ఆరేసిన టవల్‌తో తోటి సహచరులతో కలిసి శ్రీవాత్సవ్ ఆడుకుంటుండగా టవల్ మెడకు బిగుసుకుపోయి మృతి చెందాడు. సహచరులు కూడా అంధులే కావడంతో ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. అప్పుడే క్లాసులకు హాజరైన తోటి విద్యార్థులు గదిలోకి రాగానే దుర్వాసన వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అంధ విద్యార్థులు అక్కడి సిబ్బందికి విషయం తెలిపారు. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే శ్రీవాత్సవ్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
బెట్టింగ్ యాప్‌నకు విద్యార్థి బలి
మారేడ్‌పల్లి, జూలై 9: తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టాలని కొడుకుకు డబ్బులిస్తే.. ఆ డబ్బులను బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండలోని రవీంద్రనగర్‌కు చెందిన కోడూరు నితిన్(21) ఘట్కేసర్ సమీపంలోని యమనంపేటలో ఉంటూ అక్కడే శ్రీనిధి కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ఫీజు కట్టాలని తల్లిదండ్రులు నితిన్‌కు రూ. లక్షా 20 వేలు ఇచ్చారు. ఈ డబ్బును బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఫీజు డబ్బుల కోసం కళాశాల యాజమాన్యం నితిన్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పది రోజుల కిందట నితిన్‌ను మందలించారు. మనస్తాపానికి గురైన అతడు మంగళవారం ఘట్కేసర్ -చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో మహిళా కౌలురైతు ఆత్మహత్య
భీమదేవరపల్లి, జూలై 9: అప్పులు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన ఓ మహిళా కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా లో చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమదేవరపల్లి మం డలం వంగర గ్రామానికి చెందిన ఏలూరి శ్రీనివాస్‌రెడ్డి, అతని భార్య సునీత (40) లకు వ్యవసాయ భూమి లేదు. కౌలు వ్యవసాయం చేసి జీవనోపాధి పొందుతున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు పెండ్లి, వ్యవసాయ పనుల కోసం రూ.15 లక్షలు అప్పు అయింది. చివరకు ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇల్లు అమ్మినా అప్పు తేర్చలేమని గ్రహించిన సునీత.. వంట గదిలో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

