Yorker | మోదీ-షా ద్వయమే కాదు.. హరిహరాదులు వచ్చినా తెలంగాణలో గెలువలేమని ముందుగానే గ్రహించిన బీజేపీ ఉనికిని చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నది. తెలంగాణలో కాషాయ పార్టీ ఒక్కంకెకే పరిమితమవుతుందని సోషల్మీడియా కోడై కూస్తున్నది. ఎలాగో ఓడిపోవడం ఖాయమని తెలుసుకున్న కమలం పార్టీ.. కనీసం నోటాను అయినా అధిగమించాలని టార్గెట్ పెట్టుకున్నదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అందులో భాగంగానే తెలంగాణలో చచ్చిపోయిన టీడీపీ, ఉనికే లేని జనసేన మద్దతు కోసం తాపత్రయ పడుతున్నదని టాక్. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు.. తెలంగాణలో దిక్కూదివాణం లేని జనసేన, తలాతోక లేని టీడీపీతో ఒరిగేదేముంది! మహా అయితే నోటాను మించి ఓట్లు వస్తాయన్న చిన్నిచిన్ని ఆశ!