హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవా ర్డు ప్రకటిస్తే కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతున్నదని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలంలో ఆమె మీడియాతో మాట్లాడు తూ.. ఈ నెల 26న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మరోసారి మోసం చేశారని విమర్శించారు. పద్మశ్రీ అవార్డుపై రాద్ధాంతం చేస్తూ సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు.