హుజూరాబాద్ టౌన్, మే 2: ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం కొనబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం చేతకాక, ప్రజలను, రైతులను నమ్మించడానికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని విమర్శించారు. అదానీ, అంబానీకి మోదీ అన్ని రంగాలను ధారాదత్తం చేస్తుండటంతో ప్రజలు అతి పేదరికానికి వెళ్తున్నారని చెప్పారు.