హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో తరుణ్ చుగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, మరింత బలోపేతానికి చేపట్టాల్సిన అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా తరుణ్‌చుగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నిరాశను ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు బండి సంజయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్వీఎస్ఎస్ ప్ర భాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, నేతలు ఆచారి, ఎన్వీ సు భా ష్, వీరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.