పోలీస్‌స్టేషన్ కూలగొడతా!

ఎంపీ ధర్మపురి అర్వింద్ బెదిరింపు
నందిపేట్ పోలీసులపై దాదాగిరి
నందిపేట్, సెప్టెంబర్ 3: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. 200 మందిని వెంటేసుకుని ఠాణా వద్ద బైఠాయించి దాదాగిరి చేశారు. తన కార్యకర్తల జోలికి వస్తే ఠాణాను కూలగొడుతానంటూ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట ఎస్సైని అర్వింద్ బెదిరిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మా రింది. బాధ్యతగల ప్రజాప్రతినిధిగాకాకుం డా రౌడీలా ఎంపీ వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీ డియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతు న్న నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన యువకుడిని నాలుగైదు రోజుల క్రి తం పోలీసులు మందలించారు. మరోమా రు అలాంటివి పెట్టవద్దని, కేసుల పాలైతే భవిష్యత్తు అంధకారమవుతుందని నచ్చజెప్పారు. బీజేపీ కార్యకర్త అయిన సదరు యువకుడు విషయాన్ని ఎంపీ అర్వింద్‌కు చేరవేయగా.. శుక్రవారం ఆయన 200 మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్ ఆవరణలోనే కుర్చీలో కూర్చుని పోలీసులను దబాయించారు. ‘ఇప్పుడు 200 మందే వచ్చిండ్రు.. రేపు నేను 10 వేలమందిని తీసుకొస్త.. ఫైరింగ్ జేస్తరా..? మీరుజేసే పనులకు పోలీస్‌స్టేషన్‌ను కూలగొడ్తరు’ అంటూ అర్వింద్ హెచ్చరించారు. తమ కార్యకర్తల జోలికి రావొద్దంటూ అల్టీమేటం జారీచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎస్సై శోభన్‌బాబును పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిలబెట్టి అందరిముందు అవమానపరిచేలా మాట్లాడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Dharmapuri Arvind
- Nandipet
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

