Muslim Voters | నిజామాబాద్ : మహిళా ఓటర్ల పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ముస్లిం మహిళా ఓటర్లు బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అభ్యంతరం తెలిపారు. అసలు ఓటు వేయడానికి ఎవరు వచ్చారు..? ఎలా గుర్తిస్తారు..? అని ముస్లిం మహిళా ఓటర్లను ఉద్దేశించి ప్రిసైడింగ్ ఆఫీసర్పై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారని నిలదీశారు. వారేదో బెదిరిస్తే మీరు అనుమతిస్తారా..? అని అరవింద్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా ముస్లిం మహిళా ఓటర్లను తనిఖీ చేశారు. బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ముస్లిం మహిళా ఓటర్లను మాధవీలత పరీక్షించారు. వారి ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను పరిశీలించారు. ఆమె పలువురు ఓటర్ల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఇక అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగినిపై కూడా మాధవీలత మండిపడ్డారు. అసలు ప్రభుత్వం తరపున వచ్చే ఉద్యోగులను నమ్మకూడదు అంటూ మాధవీలత పేర్కొన్నారు.
In the dance of democracy, look at how veiled Muslim women voters are treated!!
Just look at Madhavi Latha, she’s shaming muslim women for their appearances. And according to UIDAI aadhar photo need to updated every 10 years. The photo might be old..what’s wrong in that.
Arvind… pic.twitter.com/Cvkt3gG3eV— Dr. Extra2ab Ø (@SaffronSalim) May 13, 2024
నిజామాబాద్ ఎన్నికల అధికారితో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి వాగ్వాదం.. pic.twitter.com/vO8P9hpFlZ
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024