హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ చానల్ పాడ్‌క్యాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ప్రాంతంలో కొండా సురేఖ స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగుతున్న మహిళ పార్టీలోకి వస్తానంటే ఎవరు వద్దంటారు? అని ప్రశ్నించారు.
కొండా సురేఖను చేర్చుకోవడం విషయంలో పార్టీలో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి కదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, పార్టీ హైకమాండ్ ఆ విషయాన్ని చూసుకుంటుందని వివరించారు. ప్రస్తుత మంత్రుల్లో అనేకమంది నాలుగు, ఐదుసార్లు గెలిచారని అయినా.. సీఎం రేవంత్‌రెడ్డి కారణంగా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ కొలాప్స్ ఉన్నదని అరవింద్ అన్నారు.