హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2023లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు గురువా రం కొట్టివేసింది. పోలీసులు మోపిన అభియోగాలకు అనుగుణంగా ఆధారాలు లేవం టూ కేసును కొట్టివేసింది.
పరీక్షల సందర్భం గా విద్యార్థులను రెచ్చగొట్టే ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సంజయ్‌కి సూచించింది.