హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలపై క్యాబినెట్ సమావేశంలో ఎందుకు చర్చించడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హామీల అమలుకు స్పష్టమైన ప్రణాళిక ఎందుకు రూపొందించడంలేదని నిలదీశారు.
బలహీన వర్గాలను వంచించిన కాంగ్రెస్: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): బడగు బలహీన వర్గాలను కాంగ్రెస్ వంచించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేయాలని ముఖర్జీ ఉద్యమాన్ని చేపట్టారని గుర్తు చేశారు.
విత్తన రైతులకు పరిహారం ఇవ్వాల్సిందే: కోదండరెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : జోగులాంబ-గద్వాల జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు కమిషన్ చైర్మన్ కోద ండరెడ్డి సీడ్ కంపెనీలను ఆదేశించారు. సోమవారం రైతు కమిషన్ కార్యాలయంలో సీడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. కోదండరెడ్డి మాట్లాడుతూ.. సీడ్ కంపెనీలు ఇష్టానుసారం వ్యవహరించకుండా రైతుల కోణంలో ఆలోచన చేయాలని సూచించారు.