చెంగిచెర్ల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన చెంగిచెర్ల దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన చెంగిచెర్ల దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. నిందితులందరినీ గుర్తించి, వారిపై కఠిన చట్టాలు ప్రయోగించాలని కోరారు.
మహిళలు, గర్భిణులు, వృద్ధులపై 300 మంది దాడి చేస్తే కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసిందని విమర్శించారు. బాధితులకు సా యం అందించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ర్టా ల్లో చిన్న ఘటన జరిగినా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ చార్టెడ్ ఫె్లైట్లో వెళ్తుంటారని, చెంగిచెర్లకు రావడానికి మా త్రం వారికి మనసొప్పడం లేదని ఎద్దేవా చేశారు. చెంగిచెర్లలో ప్రభుత్వం ఇంకా కేటాయించని డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారని, వారిని ఖాళీ చేయించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

