రేవంత్ ల్యాండ్ మాఫియా కోసమే హిల్ట్!
సీఎం రేవంత్‌రెడ్డి ల్యాండ్ మాఫియా, ల్యాండ్‌పూలింగ్ పాలన నడుపుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రూ.6.30 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే ‘హిల్ట్ పాలసీ’పై రాత్రికి రాత్రే జీవో తెచ్చారని ఆరోపించారు.
- 6 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు భారీ కుట్ర
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శ
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ల్యాండ్ మాఫియా, ల్యాండ్‌పూలింగ్ పాలన నడుపుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రూ.6.30 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే ‘హిల్ట్ పాలసీ’పై రాత్రికి రాత్రే జీవో తెచ్చారని ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిల్ట్ పాలసీపై చర్చకు సవాల్ విసిరితే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ వద్ద చర్చకు మంత్రులు రాలేదంటే అవినీతి జరిగినట్టేనని స్పష్టంచేశారు. హిల్ట్‌పై ప్రభుత్వం వేసిన సబ్‌కమిటీ విధి విధానాలు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బూటకపు సబ్‌కమిటీ వేసి, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టాలని కుట్ర పన్నినట్టు ఆరోపించారు.
పార్టీ హైకమాండ్‌కు కమీషన్లు ముట్టజెప్పేందుకే ఈ స్కామ్‌కు తెరలేపారని విమర్శించారు. హిల్ట్‌లో ముఖ్యమంత్రి, మంత్రిమండలి, హైకమాండ్ వాటాలు ఎంతో బయట పెట్టాలని నిలదీశారు. హిల్ట్‌లో భారీ స్కామ్ జరిగిందని సాక్ష్యాధారాలతో రుజువు చేయకపోతే రాజకీయం సన్యాసం చేస్తానని, ఉత్తమ్, సబ్‌కమిటీలోని మంత్రులకు సవాల్ స్వీకరించే దమ్ముందా? అని ప్రశ్నించారు.
హిల్ట్ పాలసీపై అసెంబ్లీ వద్దకు మంత్రులు రావాలని సవాల్ విసిరిన ఏలేటి.. శనివారం అసెంబ్లీ వద్దకు వచ్చారు. మంత్రులు ఉత్తమ్, భట్టికి కుర్చీలు వేయించారు. కుర్చీలపై మంత్రుల పేర్లు ఏర్పాటు చేయడంపై అసెంబ్లీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు. భట్టి, ఉత్తమ్ చర్చకు రావాల్సిందేనని ఏలేటి కాసేపు అసెంబ్లీలో కూర్చున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

