Vizag Steel Plant | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి( BRS Party ) తొలి విజయం సాధించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రయివేటీకరణను అడ్డుకుంటామని పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పోరాటంతో కేంద్రం దిగివచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసింది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు.
ఈ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పందించారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన కేసీఆరే అని స్పష్టం చేశారు. మేం తెగించి కొట్లాడాం కాబట్టే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటదని కేటీఆర్ స్పష్టం చేశారు.