కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25,041 ఓట్లు పోలవ్వగా.. అందులో 897 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మొత్తం చెల్లుబాటు అయిన 24,144 ఓట్లలో బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. ఇక పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక అశోక్ కుమార్‌కు 2,621 ఓట్లు వచ్చాయి.
ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ రెడ్డి సన్నిహితుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్ రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరామ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన బలపరిచిన పన్నాల గోపాల్‌రెడ్డికి కేవలం 24 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Karimnagar Mlc1