నాగర్‌కర్నూల్, మే 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 13న చిన్నకారుపాములలో ఎమ్మార్పీఎస్, బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులైన మైసమ్మ, చైర్మన్ శ్రీనివాసులుతోపాటు పదిమంది దాడి చేశారని తెలిపారు.
వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కోళ్ల శివ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కొల్లాపూర్ సీఐ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్పీతో మాట్లాడి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.