KTR | రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం పదేండ్ల బీజేపీ పాలనలో సర్వసాధారణంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కవిత అరెస్టుపై ట్విట్టర్ (ఎక్స్)వేదికగా కేటీఆర్ స్పందించారు.
ఈ కేసుకు సంబంధించి తొందరలోనే ( మార్చి 19వ తేదీన ) సుప్రీంకోర్టులో విచారణకు రానున్నదని కేటీఆర్ తెలిపారు. ఈ సమయంలో ఈడీ ప్రదర్శించిన దుందుడుకు తొందరపాటు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టుకు స్వయంగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. ఇవాళ ఈడీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిచిందని కేటీఆర్ అన్నారు. కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని.. న్యాయబద్ధంగా దీనిపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Abuse of power and institutional misuse to settle political scores is something that has become increasingly common with BJP Govt in last 10 years
ED needs to answer Supreme Court on the inordinate rush to arrest when the matter is very much sub-judice & up for review in a…
— KTR (@KTRBRS) March 15, 2024