రాంచీ: ఎంపిక చేసిన ఖైదీలు పగటిపూట జైలు వెలుపల పనిచేసి, సాయం త్రం తిరిగివచ్చేలా జైలు సంస్కరణల విధానాన్ని జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. పునరావాసంతో పాటు ఆదా య మద్దతును అందించడం, ఖైదీలు తిరిగి సమాజంలో సులభంగా కలిసిపోయేలా చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. ఖైదీలు స్వయం సమృద్ధిని సాధించడానికి, వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడటానికి, విడుదలైన తర్వాత కొత్త జీవితానికి వారిని సిద్ధం చేసేందుకు ఈ చొరవ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
అర్హులైన ఖైదీలు జైలు ప్రాంగణం వెలుపల పనిచేయడానికి ఉదయం 6 లేదా 7 గంటలకే జైలు నుంచి బయలుదేరవచ్చు. వారు 12 గంటలలోపు అంటే సాయంత్రానికి తిరిగి రావాల్సి ఉంటు ంది. ఈ పథకం ఖైదీలందరికీ వర్తించదు. అర్హత ప్రమాణాలు, నిబంధనలను నిర్దేశిస్తూ జైలు పరిపాలనా విభాగం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ) రూపొందిస్తుంది. బయట పనిచేయడానికి అనుమతించిన ఖైదీలను జైలు యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు సెంట్రల్ జైళ్లలో ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.