హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మారుమూల పల్లెలకూ నాణ్యతా ప్ర మాణాలను చేరవేసేందుకు, వస్తువుల నాణ్యతపై అవగాహన కల్పించేందుకు భారతీయ ప్ర మాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాం డర్డ్స్) నిర్విరామంగా కృషి చేస్తున్నది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుండగా పంచాయతీలనూ ఇందులో భా గం చేయనున్నామని, ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 2.4 లక్షల గ్రామ పంచాయతీలను ఈ విషయంలో అప్రమత్తం చేసినట్టు బీఐఎస్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
తెలంగాణ వ్యాప్తంగా 12వేలకు పైగా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించామని, త్వరలోనే జిల్లా అధికారుల సమక్షంలో శిక్షణ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ శాఖ అధిపతి, సీనియర్ డైరెక్టర్ కేవీ రావు వెల్లడించారు. ఈ నెల 20న నల్లగొండ జిల్లాలో తొలి విడత కార్యక్రమం మొదలు కానున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ శాఖ పరిధిలో 22 జిల్లాల ఉన్నతాధికారులు, అన్ని విభాగాల అధిపతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దాదాపు వంద పాఠశాలలు, కళాశాలల్లో స్టాండర్డ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు సైన్స్, స్టాండర్డ్స్ కలిపి అవగాహన కల్పిస్తున్నట్టు పేరొన్నారు. ప్రతి ఒకరూ బీఐఎస్ కేర్ యాప్ను వినియోగించడం ద్వారా స్వీయ సాధికారత సాధించవచ్చునని స్పష్టం చేశారు.