హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, గజ్జెల నగేశ్, మేడే రాజీవ్‌సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాంచంద్రనాయక్, టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్, బీసీ కమిషన్ మాజీ మెంబర్లు కిశోర్‌గౌడ్, శుభప్రద్‌పటేల్, ఉపేంద్రాచారి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, పార్టీ నాయకులు యూసుఫ్‌అలీ, వివిధ కుల, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.