భీమారం, అక్టోబర్ 25 : ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నాడు. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకుడు గుడ్డు తిరుపతి జన్మదిన వేడుకలు నిర్వహించాడు. గేటు ముందు దర్జాగా బైక్ నిలిపి దానిపై కేక్ పెట్టి కోశారు. ఈ వేడుకలో నాయకులు పోడెటి రవి, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్, ఉష్కమల్ల శ్రీనివాస్, భూక్య లక్ష్మణ్‌నాయక్, కోట రవి, చెడంక తిరుపతి, అనపర్తి రమేశ్ పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా అక్కడున్న పోలీస్ అధికారులు, సిబ్బంది అడ్డుకోకపోవడంపై స్థానిక ప్రజలు, ఇతర పార్టీల నాయకులు భగ్గుమంటున్నారు. ఈ విషయమై ఎస్సై శ్వేతను వివరణ కోరగా.. మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చినట్టు తెలిపారు. స్టేషన్ బయట వేడుకలు జరుపుకొన్నట్టు సోషల్ మీడియాలో చూసి వారిని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు.
మాకూ ఓటు హక్కు కల్పించాలి ; ప్రైమరీ స్కూల్ టీచర్లూ పట్టభద్రులే
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకు క ల్పించాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. యాదాద్రి భువనగిరి జి ల్లా బొమ్మల రామారం మండలం బండకాడిపల్లికి చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ బీమనబోయిన కృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎల్ శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రా బోయే ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే టీచర్లను ఓటర్లుగా పరిగణించేలా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ తర ఫు న్యాయవాది చికుడు ప్రభాకర్ కోరారు. డిగ్రీ చేసినప్పటికీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్లకు ఓటు హకు కల్పించకపోవడం రా జ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ ఆ చట్టంలోని నిబంధన 27(3) (బి) సెక్షన్‌ను సవాలు చేయలేదని, పిల్లో ఉత్తర్వుల జారీ అవసరం లేదని అన్నారు. ఇందుకు అనుమతిచ్చిన కోర్టు విచారణను వాయిదా వేసింది.