Bio Liquor | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. అన్ని అనుమతులతో బుధవారం ఈ లిక్కర్‌ను విడుదల చేసినట్టు తెలిసింది. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బీ శ్రీనివాస అమర్నాథ్ ఈ లిక్కర్‌ను సృష్టించారు. ఎలాంటి సింథటిక్ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన ఈ లిక్కర్లో బయో ఫ్లేవనాయిడ్స్, బయో ఆల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, వివిధ మూలికలు ఉంటాయని సమాచారం.
అకాసియా, కలబంద, పసుపు, తులసి, లవంగాలు, కొత్తిమీర, అల్లం, దాల్చినచెక, జీలకర్ర, నల్ల మిరియాలు, బ్లాక్బెర్రీస్, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపేన్, జెనిటన్, రైజోమ్, గ్వారానా, రటానీ రూట్, సహజసిద్ధమైన వెనిల్లా, వలేరియన్, వెరోనికా, వైల్డ్ చెర్రీ, తేనె, బే ఆకులు, బ్రయోనియా రూట్ తదితర పదార్థాలతో ఈ మద్యాన్ని తయారు చేసినట్టు తెలిసింది.