పాపన్నపేట,మే 12: కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్మాల్ జరిగినట్టు మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన కౌలు రైతు బైండ్ల భూమయ్య ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత రైతు వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట పెద్ద ఎస్సీవాడ వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి కౌలురైతులు బైండ్ల భూమ య్య, బట్టి భారతి, ప్రభాకర్, నదరి నారాయణ, చోటు, కుర్మ కిషన్‌కు చెందిన 766 బస్తాలతో లారీ లోడ్‌చేశారు. శనివారం ధాన్యం లారీ లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ రైస్‌మిల్‌కు వెళ్లింది.
ఆదివారం బైండ్ల భూమయ్యకు చెంది న 50 బస్తాలు తక్కువగా రావడంతో రూ.47 వేల వరకు నష్టపోయినట్టు వాపోయారు. కమ్యూనిటీ కోఆర్డినేటర్ శివరాణిని వివరణ కోరగా.. చీకటి కావడంతో కమిటీ మెంబర్లు లారీ పూర్తిస్థాయిలో లోడ్ కాకముందే ఇంటికి వెళ్లారన్నారు. ట్రక్ షీట్‌పై కమిటీ మెంబర్ల సంతకం ఉంటుందని, హమాలీల వద్ద కూడా లెక్క ఉంటుందని చెప్పారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్టు వివరించారు.