సిద్దిపేట, ఏప్రిల్ 6: ‘మా రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పాపకు ఇలాంటి ఆపద వస్తే అసలు బతికేది కాదని’ బీహార్ రాష్ర్టానికి చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మె రుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పరిధిలో నివాసముంటూ మెగా కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్న బీహారు వాసి ప్రేమ్‌నాథ్ యాదవ్ దంపతులకు 23 రో జుల శిశువు ఉంది.
బుధవారం పాపకు స్నానం చేయిస్తున్న సమయంలో ముక్కులోకి నీరుపోయి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే స్థానిక హెల్త్‌సెంటర్‌కు తరలించా రు. వారు 108కి సమాచారం అందిం చగా.. 10 నిమిషాల్లో సిబ్బంది అక్కడికి చేరుకొని పాపకు సీపీఆర్ చేసి బతికించిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించి ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స చేశారు.
ప్రేమ్‌నాథ్ యాదవ్ మాట్లాడుతూ.. వేరే రాష్ట్రం అని చూడకుండా ఇక్కడి వైద్యులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట దవాఖానలో సకల సౌకర్యాలు కల్పించడం వల్లనే తమ బిడ్డకు మెరుగైన వైద్యం అంది బతికిందని చెప్పారు. మెరుగైన వై ద్యం చేసి పాప ప్రాణాలను రక్షించిన 108 సిబ్బంది, వైద్యులు, ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని తెలిపారు.