Jalagam Venkat Rao | జలగంకు బీజేపీ షాక్.. చివరి జాబితాలో దక్కని చోటు
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ చివరి జాబితాను విడుదల చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, ఖమ్మం అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావును ఆదివారం ప్రకటించింది. ఖమ్మం నుంచి టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
- వరంగల్ అభ్యర్థిగా అరూరి రమేశ్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావు
Jalagam Venkat Rao | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ చివరి జాబితాను విడుదల చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, ఖమ్మం అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావును ఆదివారం ప్రకటించింది. ఖమ్మం నుంచి టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మొదట్లో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. ఆయన కూడా ప్రచారం మొదలుపెట్టారు.
కానీ, బీజేపీ మరొకరి కోసం వెదుకుతున్నదని ప్రచారం మొదలైంది. దీంతో వెంకట్రావు తరుచూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఖమ్మం టికెట్‌ను ఇస్తారనే ప్రచారం సాగింది. అనూహ్యంగా వినోద్‌రావు పేరును బీజేపీ పెద్దలు ఖరారు చేశారు. దీంతో జలగం కార్యాచరణ ఏమిటనేది ఆసక్తికరంగామారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

