నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ( Excise CI Satyanarayana ) ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు( ACB Trap) చేశారు. బిచ్కుందలోని అద్దె ఇంట్లో ఉంటున్న సీఐ బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
కల్లు దుకాణం మరో గ్రామానికి తరలింపునకు అనుమతులు, కేసులు నమోదు చేయవద్దని కోరగా ప్రతిఫలంగా ఎక్సైజ్ సీఐ దీను సత్యనారాయణ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఇంటిపై దాడి చేసి పట్టుకు న్నారు. అదేవిధంగా అతని వద్ద అదనంగా లభించిన రూ.45,670లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు. సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు.