రాష్ట్ర ఇన్చార్జ్ పిలిచినా.. గాంధీ భవన్‌కు రాలేనన్న ఎంపీ కోమటి రెడ్డి
MP Komatireddy Venkat reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌కు రావడానికి నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన మాణిక్
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌కు రావడానికి నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన మాణిక్ ఠాక్రే తొలిసారిగా నేడు హైదరాబాద్‌కు వచ్చారు. పార్టీ నేతలతో ఒక్కొక్కరిగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి ఆయన ఫోన్ చేశారు. గాంధీ భవన్‌కు రావాలని, సమస్యలపై చర్చించుకుందామని ఆహ్వానించారు.
అయితే ఎంపీ కోమటిరెడ్డి దానికి తిరస్కరించారు. తాను గాంధీ భవన్‌కు రాలేనని చెప్పారు. బయట కలుస్తానని ఠాక్రేకు ఫోన్లో తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయం నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో కూడా ఆయన భేటీ అయ్యారు. దీంతో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఆయన కూడా పయణించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈనేపథ్యంలో ఆయనను మాణిక్ ఠాక్రే పిలవడం హాట్‌టాపిక్‌గా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

