ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ (DCCB) చైర్మన్‌గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవికి భోజారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.
డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన కాంబ్లే నాందేవ్ గతేడాది గుండెపోటుతో మృతిచెందారు. దీంతో అప్పటినుంచి వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి ఇన్చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ఈ నెల 31న చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటితో నామినేషన్ స్వీకరణకు గడువు ముగియనుంది. కాగా, చైర్మన్‌గా అడ్డి భోజారెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖారారు చేసింది. దీంతో ఆయన ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపిక ఏకగ్రీవమయింది.