పాపన్నపేట : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీమాత స్కంద మాత (మహాలక్ష్మి) అవతారంలో దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొన్నారు.