హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సాంకేతిక కంపెనీల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రీమియర్ సంస్థ భారత్ వెబ్ 3 అసోసియేషన్.. తెలంగాణ సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, భారత్ వెబ్ 3 అసోసియేషన్ డైరెక్టర్ కిరణ్ వివేకానంద పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. భారత్ వెబ్ 3తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉన్నదని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంకా పాల్గొన్నారు.