Bhadrachalam | భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. మత్స్యావతారంలో దర్శనమివ్వనున్న రామయ్య
Bhadrachalam | భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. తొలుత పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Bhadrachalam | భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. తొలుత పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణం, మిథిలా ప్రాంగణంలో చాందినీ వస్ర్తాలతో షామియానాలు, వెదురు తడికలతో పందిళ్లు వేశారు. గోపురానికి, ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చగా ఇల వైకుంఠపురంగా పట్టణం మారిపోయింది. అధ్యయనోత్సవాల్లో భాగంగా నిత్యం స్వామివారికి జరిపే నిత్య కల్యాణాన్ని బుధవారం నుంచి 23 వరకు(పది రోజులపాటు) నిలిపివేస్తున్నారు. ఈ నెల 22న సీతారాములు జలవిహారం చేయనున్నారు. 23న భక్తులంతా ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్వామివారు వేంచేసే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సంగీతం, కూచిపూడి నృత్యాలు, హరికథ, నాటకాలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు భక్తులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మత్స్యావతారంలో దర్శనమివ్వనున్న రాములోరు..
అధ్యయనోత్సవాల సందర్భంగా దశవతారాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య తొలుత మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రళయకాలమున నిద్రలో ఉన్న బ్రహ్మ వద్ద వేదాలను అపహరించి సముద్రంలో దాగున్న సోమాసురుడనే దానవుడిని వధించి, తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించేందుకు శ్రీమహా విష్ణువు మత్స్యావతారాన్ని ధరించారు. అలాగే కల్పాంతంలో సప్త రుషులు మనువు సృష్టికి సంబంధించిన ఔషధాలున్న నావను తన కొమ్ముకు కట్టుకొని ప్రళయం నుంచి సమస్త లోకాన్ని కాపాడిన సందర్భంలో శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించినట్లుగా పురాణాల వల్ల తెలుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

