సూర్యాపేట టౌన్, మార్చి 22 : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో యూ ట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, అంతర్జాతీయ బైక్ రైడర్ బయ్యా సన్నీ యాదవ్పై సూర్యాపేట జిల్లా పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయంలో ఈ నెల 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసు స్టేషన్లో సన్నీ యాదవ్పై కేసు నమోదైంది.
విచారణలో భాగంగా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ రవి తెలిపా రు. సన్నీ యాదవ్ వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్ దేశంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్లోకి అడుగు పెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా సన్నీని అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. పో లీసులు ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.