జూబ్లీహిల్స్, డిసెంబర్ 4: దక్షిణ భారతదేశంలో పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళగా రికార్డుల్లోకెక్కిన డాక్టర్ రాజ్యలక్ష్మికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాంకాక్‌లో జరిగిన కాన్వొకేషన్లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కాన్వొకేషన్లో టీఈఎస్వోఎల్, టీవోఈఎఫ్ఎల్తోపాటు ఇంగ్లిష్ శిక్షణను పూర్తి చేయడం ద్వారా అద్భుత విజయాన్ని అందుకునేలా అవకాశం దొరికిందని రాజ్యలక్ష్మి వెల్లడించారు. ఏసీటీ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు అందుకోవడం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ఈ స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.