కంది/సంగారెడ్డి : ఐఐటి హైదరాబాద్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అభిజిత్ అబ్రహం జార్జ్‌కు ఓ మలయాళం సినిమాకు గాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డు సొంతం చేసుకున్నారు.
2020లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళం సినిమా సూఫీయం సుజాతంకు గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు 51వ కేరళ స్టేట్ ఫిలిమ్ అవార్డ్స్ మంగళవారం ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్ తో విడుదలైన ఈ మలయాళం సినిమా ఉత్తమ చిత్రం కేటగిరీలో చోటు సంపాదించుకొని ప్రేక్షకుల ఆధరణ కూడా దీనికి లభించింది.
కాగా ఈ సినిమాకు సౌండ్ మిక్సింగ్ అందజేసిన ఐఐటి హైదరాబాద్ చెందిన అభిజిత్ కు అవార్డు లభించడం పట్ల ఐఐటి డైరెక్టర్ బీఎస్ మూర్తి తో పాటు స్థానిక విద్యార్థుల ఇతర బృందం అభినందించింది.