హుజూరాబాద్, జూన్ 18: దళితబంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. దాదాపు వంద మంది లబ్ధిదారులు మంగళవారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట నుంచి హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా, కాంగ్రెస్ సర్కారు అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.