Telangana | సూర్యాపేట : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ తప్పటడుగులు వేశారు. విద్యార్థినులకు, టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్.. చెడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మానసికంగా, శారీకంగా వేధింపులకు గురి చేస్తున్న ఆ ప్రిన్సిపాల్ తమకొద్దు అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు.
సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ రాత్రి సమయాల్లో బీర్లు సేవిస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ గదిలో లభ్యమైన బీరు సీసాలను కూడా విద్యార్థినులు మీడియాకు చూపించారు. కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
రోడ్డెక్కిన విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలని కూడా చూడకుండా ప్రిన్సిపాల్ ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు వచ్చినా కూడా వారితో కూడా ప్రిన్సిపాల్ బూతులు మాట్లాడి మానసిక వేధింపులకు గురి చేశారన్నారు. కొద్ది రోజుల క్రితం శైలజ కుమారుడు హాస్టల్‌కు వచ్చి వారం రోజుల పాటు ఉన్నాడని, అమ్మాయిల హాస్టల్లో అతనికి ఏం పని అని విద్యార్థినులు ప్రశ్నించారు. ఆ సమయంలో తాము ఇబ్బందిగా ఫీలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీటీ మేడం అండతోనే ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, తమపై దౌర్జన్యం చేస్తున్నారని విద్యార్థినులు వాపోయారు. తాగిన మత్తులో తమను ఏం చేస్తారోనని భయంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు. తక్షణమే ప్రిన్సిపాల్ శైలజతో పాటు ఏసీటీ మేడంను విధుల నుంచి సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్
హాస్టల్లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.. బీర్లు తాగుతోంది.
సూర్యాపేట – బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ మరియు… pic.twitter.com/dEFVNuzJpk
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2024