సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ వెంకట్రావు | ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.

మహబూబ్ నగర్ : ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులు, వైద్యాధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏ ఏన్ ఎం లు, ఆశాలతో సీజనల్ వ్యాధులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీజనల్ వ్యాధుల నివారణపై వెంటనే మండల స్థాయిలో తహసిల్దారులు,ఎంపీడీవోలు వైద్యాధికారులు, సర్పంచుల తో సమావేశాన్ని నిర్వహించాలని, వ్యాధుల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్త చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని ఇండ్లల్లో నీరు నిల్వ లేకుండా ఇంట్లో ఉన్న నీటిని బయట పారబోయాలని అన్నారు .దోమల నివారణకు పిచికారీ, ఫాగింగ్ కార్యక్రమాలను చేపట్టాలని, ఫాగింగ్ యంత్రాలు లేని గ్రామ పంచాయతీలు మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని, ప్రతి వారం రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాలని తెలిపారు.
అదేవిధంగా ఎక్కడ నీరు నిల్వ లేకుండా గుంతలను పూడ్చివేయలని, పూడ్చివేయడానికి అవకాశం లేని గుంతలలో గంబుషియా చేపలు ,ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. వారం రోజులలో వైకుంఠ ధామాలను పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యం లో భాగంగా రహదారుల శుభ్రం, చెత్త తొలగింపుతో పాటు క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయటం, క్లోరినేషన్ తో పాటు పారిశుధ్యం పై పట్టణాలలో గ్రామాలలో పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలనిఆన్నారు.
ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఆర్ ఓ స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, డీఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్ ఓ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

