నల్లగొండ రూరల్, జూలై 14: యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం నల్లగొండలో మీడియాతో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. వార్షిక క్యాలెండర్ ద్వారా ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తాననడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలోనే ఇలాంటి హామీలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఎత్తిచూపడం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు.