బీసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం
పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభచూపిన బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
హైదరాబాద్, మే14 (నమస్తే తెలంగాణ): పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభచూపిన బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గురువారం ఆదివాసీ భవన్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో 508 మంది విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. విద్యార్థుల సాధించిన విజయం తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థలకు గర్వకారణమని కొనియాడారు.
గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కృషి, పట్టుదలతో అద్భుత ఫలితాలు సాధించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్‌యాదవ్, బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ బాలమయాదేవి, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్రావు, గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెరిక కార్పొరేషన్ చైర్మన్‌కు శుభాకాంక్షలు
పెరిక కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు (డీవీ), వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్‌కు మంత్రి పొన్నం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీసీ కార్పొరేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పొన్నం.. పెరికల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, కోశాధికారి సందెల లింగం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

