వనస్థలిపురం/రవీంద్రభారతి(హైదరాబా ద్), నవంబర్ 19: ‘పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయకుంటే బీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం పెల్లుబుకుతుంది. రాష్ట్రం అగ్నిగుండంగా మా రుతుంది’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ నగరంలోని హస్తినాపురం నుంచి ఎల్పీనగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అ నంతరం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆర్ కృష్ణ య్య మాట్లాడారు.
42 బీసీల రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కేసు హైకోర్టులో నడుస్తున్నండగా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేశ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, బీసీ నాయకులు పాల్గొన్నారు.