హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం ప్రకటించారు. విద్యార్థుల జాబితా https:// mjptbcwreis.telangana. gov.in,https://mjpabcwreis.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నదని సొసైటీ సెక్రటరీ సైదులు తెలిపా రు. టెన్త్ మారుల ఆధారంగా సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
130బాలుర కా లేజీల్లో 11,360 సీట్లు, 127 బాలికల కాలేజీల్లో 10,720 సీట్లు కలిపి మొత్తం 22, 080 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల్లో 22, 080 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు.