హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జనాభా గణనలో కులగణన చేపట్టాలని, లేదంటే రైతుల ఉద్యమ తరహాలో ఢిల్లీని ముట్టడిస్తామని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు కుమారస్వామి కేంద్రాన్ని హెచ్చరించారు. బీసీలపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
కులగణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలని సిఫారసు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని పేర్కొన్నారు. నిర్లక్ష్య పోకడకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.