హైదరాబాద్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్‌గా నిరంజన్ సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి కూడా బాధ్యతలను స్వీకరించారు. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్, సభ్యులకు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కమిషన్ కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి, బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.