ఇచ్చోడ(బజార్హత్నూర్), జనవరి 23 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ తహసీల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కటం విద్యాసాగర్‌రెడ్డి అర్జీదారుడి నుంచి రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ డీఎస్పీ మధు పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాలు..
బజార్హత్నూర్ మండలం బాలన్‌పూర్ శివారు సర్వే నం. 11/ఏలోని 8.35 ఎకరాల సాదా బైనామా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు విద్యాసాగర్‌రెడ్డి రూ.2 లక్షలు డిమాండ్చేశాడు. శుక్రవారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.