కాంగ్రెస్‌లో చల్లారని కుంపట్లు
కాంగ్రెస్‌లో అసంతృప్త కుంపట్లు చల్లారడం లేదు. ఆగ్నికి ఆజ్యం పోసినట్టు మునుగోడులో ఆ పార్టీ నిర్వహించిన సభ ఆసంతృప్తులను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. ఈ సభతో పార్టీలో రేవంత్‌రెడ్డి వన్‌మ్యాన్ షో మరింత ఎక్కువయ్యిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు
- పెల్లుబుకుతున్న అసంతృప్త జ్వాలలు
- ఆజ్యం పోసిన మునుగోడు సభ
- తారాస్థాయికి రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వ్యవహారం
- రేవంత్ క్షమాపణ చెప్పినా అంగీకరించని వెంకట్‌రెడ్డి
- వెంకట్‌రెడ్డికి తోడుగా ఏకమవుతున్న సీనియర్ నేతలు
- అధిష్ఠానం వద్దే తెల్చుకోవాలని నిర్ణయం.. ఇప్పటికే ఫిర్యాదులు
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో అసంతృప్త కుంపట్లు చల్లారడం లేదు. ఆగ్నికి ఆజ్యం పోసినట్టు మునుగోడులో ఆ పార్టీ నిర్వహించిన సభ ఆసంతృప్తులను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. ఈ సభతో పార్టీలో రేవంత్‌రెడ్డి వన్‌మ్యాన్ షో మరింత ఎక్కువయ్యిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీనియర్లను ఏ మాత్రం గౌరవించకుండా రేవంత్, అతని అనుచరులు ఇష్టానుసారంగా మాట్లాడటంపై సీనియర్లు రగిలిపోతున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో అన్ని రకాల గొడవలు, వివాదాలు ఒక ఎత్తు అయితే రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం మరో ఎత్తు. ఇందులో భాగంగానే ఇప్పటికే రేవంత్‌రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది.
ఇప్పుడు ఇది కాస్త మరింత ముదిరి క్షమాపణలు చెప్పే స్థాయికి చేరింది. బ్రాండీ షాపులు నడుపుకొనే వారంటూ, హోంగార్డులంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నట్టు స్వయంగా వెంకట్రెడ్డే ప్రకటించారు. ఇందుకు బలం చేకూర్చుతూ ఇటీవల మునుగోడు సభలో రేవంత్‌రెడ్డి.. తన అనుచరులతో వెంకట్‌రెడ్డిని తిట్టించారు. ఈ విషయాన్ని కూడా వెంకట్రెడ్డే స్వయంగా వెల్లడించారు. రేవంత్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌చేశారు. మునుగోడు సభ గొడవ మరింత ముదురుతుండటంతో దిగొచ్చిన రేవంత్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పారు. రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం, అసహనంతో ఉన్న వెంకట్‌రెడ్డి ఆ క్షమాపణను స్వీకరించకపోవడం గమనార్హం. తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వెంకట్‌రెడ్డి పట్టుబడుతున్నారు.
ఒక్కటవుతున్న సీనియర్లు
పార్టీలో ఒంటెద్దు పోకడలు పోతున్న రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలంతా ఎప్పటి నుంచో తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై బదులు తీర్చుకొనేందుకు వారంతా అదునుకోసం వేచి చూస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంలో రేవంత్ దొరికిపోయారు. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు సీనియర్ నేతలంతా ఒక్కటైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకుండా అధిష్ఠానం వరకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీనియర్ నేతను అవమానించిన తీరును అధిష్ఠానానికి ప్రత్యక్ష ఉదాహరణతో చూపించాలని భావిస్తున్నట్టు సమాచారం. రేవంత్ విషయాన్ని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల వద్దే తేల్చుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే వెంకట్‌రెడ్డి.. రేవంత్ క్షమాపణను స్వీకరించకపోడానికి ఇదే కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

