హైదరాబాద్ : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలు, ఇండ్ల వద్దకు చీరలు చేరాయి. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
18 ఏండ్లు పైబడి రేషన్ కార్డులో పేరు నమోదైన వారికి చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 810 రకాల చీరలను, 1.08 కోట్ల మహిళలకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. బతుకమ్మ చీరల కోసం రూ. 333.14 కోట్లు ఖర్చు చేశారు.