హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): దేశంలోని 6 ముఖ్యమైన నదుల పరివాహక ప్రాంతాల నిర్వహణకు పటిష్ట ప్రణాళికలను రూపొందించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఐఐటీలు, ఎన్ఐటీలకు అప్పగించింది. గోదావరి రివర్ బేసిన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్, నీరి నాగపూర్.. కృష్ణా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను వరంగల్, సూరత్కల్ ఎన్ఐటీలకు అప్పగించింది.