బాసర, మే 15 : తనపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించి, న్యాయం జరిగేలా చూడాలని నిర్మల్ జిల్లా బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి పేర్కొన్నారు. గురువారం ఆయన బాసరలో విలేకరులతో మాట్లాడారు. సంప్రదాయంగా వస్తున్న అమ్మవారి అక్షరాభ్యాసాన్ని కాదని, బాసరలో బీజాక్షరం రాస్తున్న ఆంధ్ర స్వాములోరికి విరుద్ధంగా వెళ్తున్నందున తనపై దాడి చేశారని తెలిపారు.
బుధవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా.. ఒక వ్యక్తి తనపై దాడి చేయగా 100 నంబర్‌కు డయల్ చేశానని, ఫోన్ కలవక పోవడంతో అన్న కుమారుడి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి చేసిన ఘటనలో బాసర దేవస్థానం సిబ్బందితోపాటు వ్యాసపురి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.