బాసర, జూన్ 22: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిందని ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ తెలిపారు.
బాసర, మహబూబ్నగర్ సెంటర్లలో మొత్తం 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. జూలై 7 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.